సమితి చేపట్టిన కార్యక్రమములు

  1. నిత్యావసర వస్తువులు పంపిణి :-  బీద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులు పంపిణి.
  2. ఉగాది వస్త్రదాన కార్యక్రమము :- విద్యార్దులకు దుస్తుల పంపిణి.
  3. మహిళా స్వయం ఉపాధి పధకం :-మహిళా స్వయం ఉపాధి పధకం క్రింద వెట్ గ్రైండర్, వంట సామాగ్రి మోటర్ రివైండింగ్ యంత్రం పంపిణి.
  4. వ్రాత పుస్తకములు పంపిణి: :-వివిధ కోర్సులలో చదువుతున్న ప్రతిభగల బీద బ్రాహ్మణ విద్యార్దులకు వ్రాత పుస్తకములు, స్కాలర్ షిప్స్ పంపిణి.
  5. సెమినార్ బ్యాగ్స్ పంపిణి :- వేద విద్యార్దులకు, అర్చక స్వాములకు, పురోహితులకు సెమినార్ బ్యాగ్స్ పంపిణి.
  6. సరస్వతి హొమం ఎర్పాటు :- విద్యార్దుల అభివృద్దికై ప్రతి శ్రీపంచమికి సరస్వతి హొమం ఎర్పాటు.
  7. ఉచిత శిక్షణ :- పోటి పరీక్షలైన గ్రూప్ I, II, police sub inspector మొదలైన వాటికి ఉద్యోగాల కొరకు ఉచిత శిక్షణ.
  8. అభినందన ఆశీస్సులు :- EAMCET, AI EEE, IIT మరియు ఇతరత్రా కోర్సులలో ప్రతిభ కనబరచిన విద్యార్దులకు అభినందన ఆశీస్సులు.
  9. అభినందన సత్కారము :-  బ్రాహ్మణ జాతి గర్వించేలా వైద్యవృత్తికి వన్నె తీసుకు రావాలని ఆకాంక్షిస్తూ, యువ బ్రాహ్మణ వైద్యులకు అభినందన సత్కారము.
  10. ఆది దంపతుల సత్కారము :- 50 వసంతాల వైవాహిక జీవనంలో బ్రహ్మాణ యువతకు మార్గ దర్శకులైన ఆది దంపతులకు గౌరవ సత్కారం.
  11. వేదఘోష :- పరమ పవిత్రమైన విశ్వవిఙ్ఙాన గౌరవ సత్కారం వేద పాఠశాలల విద్యార్ధులచే వేదం సుస్వరంగా వేద మాధుర్యాన్ని అందరికి పంచాలనే సత్సంకల్పంతో నిర్వహించిన కార్యక్రమం.
  12. శ్రీ కృష్ణ పద సేవలో :-  శ్రీ కృష్ణాష్ణమి  సంధర్బంగా కృష్ణ పద సేవ శాస్త్రియ సంగీత నృత్య, గేయమాలిక, చిన్నారులచే శ్రీ కృష్ణాలంకరణ కార్యక్రమ నిర్వహణ.
  13. సుందరకాండ ప్రవచనములు :- బ్రహ్మశ్రీ చగంటి కోటేశ్వరరావు గారు, శ్రీమాన్ సింగనాచార్యులు గారిచే సుందరాకాండ ప్రవచనములు, లక్ష తులసి, కుంకుమార్చన, సింధూరార్చన, సుందరకాండ పారయణము.
  14. సాముహిక ఉపనయనములు :- సాముహిక ఉపనయనములు, ఉపాకర్మలు ప్రతి సంవత్సరము మాఘ, శ్రావణ మాసాలలో సాముహిక ఉపనయనములు.
  15. ఉచిత కంటి పరీక్షలు :- WHO, ESI వారి ఆద్వర్యములో ఉచిత కంటి పరీక్షలు, శుక్లలా ఆపరేషన్ లు.
  16. Free Health Cards పంపిణి  :- Free / Concessional Healthy & Diagnostic Cards సహృదయులైన వైద్యులు – Diagnostic Centre’s సహకారంతో సబ్యులకు, వాలంటీర్లకు Health Cards పంపిణి.
  17. మనభాషా మన సంస్కృతి :- బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారిచే మన భాష మన సంస్కృతి తెలుగు పద్య ప్రవాహముపై ఉచిత శిక్షణా తరగతులు.
  18. ఉప్పెన బాధితులకు :- ఉప్పెన బాధితులకు సహయార్ధం Used Cloth Collection, వంట సామాగ్రి, వంట సరకులు పంపిణి, కాశ్మీరి నిరశ్రయులకు ధాన్యం పంపిణి.
  19. సమారధనోత్సవములు :- కార్తిక మాసంలో గత కొన్ని సంవత్సరాలుగా మన బ్రాహ్మణ కుటుంబాలందరూ కలిసి Get Together సాముహిక పూజాకార్యక్రమములు విందు వినోదాలతో ఆరోజంతా సందడితో సమరాధనోత్సవము ఏర్పాటు.
  20. వివాహ సమాచార కేంద్రము :- గాయత్రి బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రము గత 20 సం"" ల నుండి వివాహ కేంద్రం Matrimonial Information Through Multimedia Presentation & CD ల ద్వారా ఏంతో మందికి వివాహములు కుదర్చడములో సహకరించింది. కాని సభుల సహకారం లేక గత 6 నెలలుగా నిలిపి వేయబడినది.  దానికి చాల చింతిస్తున్నాము.
  21. అశ్రుతర్పణం :- భారత మాజి ప్రధాని స్వర్గీయ కీ.శే.పి.వి.వి. నర్శిం హారావు గారికి అ-ఆల అక్షరమాలికశ్రునివాళి.

~~*~~

2 comments:

  1. బీద బ్రాహ్మణులకు మసికము (పిత్రు రుణం) ఎత్త్యాది కై మన సంస్థ నుండి ఏవిధమైన సహాయము పొందగలము,దయచేసి చెంప్పండి

    ReplyDelete
  2. బీద బ్రాహ్మణులకు మసికము (పిత్రు రుణం) ఎత్త్యాది కై మన సంస్థ నుండి ఏవిధమైన సహాయము పొందగలము,దయచేసి చెంప్పండి

    ReplyDelete